25-04-2025 10:53:11 PM
మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని అన్నారం క్రాస్ వద్ద ద్విచక్రవాహన ప్రమాదంలో కుడుదుల అనిల్(21) యువకుడు మృతి చెందాడు. మహదేవపూర్ కాళేశ్వరం జాతీయ రహదారి అన్నారం డేంజర్ క్రాస్ దగ్గర బైక్ పై వెళ్తున్న మంథని మండలం ఖాన్ సాయిపేట గ్రామనికి చెందిన కుడుదుల అనిల్ ని గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అటుగా వెళుతున్న వాహనదారులు 108కి సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు108 వైద్య సిబ్బంది తెలిపారు. కాళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.