calender_icon.png 1 April, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ బెట్టింగ్‌కు యువకుడి బలి

26-03-2025 12:00:00 AM

  • రూ.2 లక్షల అప్పు చేసి బెట్టింగ్

పోగొట్టుకుని రైలు కింద పడి ఆత్మహత్య 

మేడ్చల్, మార్చి 25 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు ఓ యువకుడు బలయ్యాడు. రూ.రెండు లక్షలు అప్పు చేసి, బెట్టింగులో నష్టపోవడంతో మనోవేదనకు గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసు యుష్నూడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి చెందిన సోమేష్(29) కొంపల్లిలో గోదాం ఇన్‌చార్జిగా పనిచేస్తూ గుండ్ల పోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడిన సోమేష్ రూ.2లక్షల అప్పు చేశాడు.

అవి బెట్టింగ్‌లో పోవడంతో మనో  గురయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. స్నేహితులకు లోకేషన్ షేర్ చేశాడు. గౌడవెల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లొకేషన్ ఆధారంగా అక్కడకు వెళ్లిన స్నేహితులు మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.