25-03-2025 02:08:58 PM
మేడ్చల్,(విజయక్రాంతి): బెట్టింగ్ కారణంగా మరో యువకుడు మృతి చెందిన ఘటన మేడ్చల్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన సోమేశ్(29) అక్క పెళ్లి కోసం దాచిన డబ్బులను ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 మ్యాచ్ ల్లో క్రికెట్ బెట్టింగ్ పెట్టి రూ.2 లక్షలు పొగొట్టుకున్నాడు. డబ్బులు కోల్పోయాడనే మనస్తాపంతో యువకుడు గౌడవెల్లి వద్ద రైలు కింద పడి ఆత్యహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.