09-03-2025 08:52:29 PM
జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన యువకుడు కొడకండ్ల సాయికిరణ్ వయసు 20 సంవత్సరాలు ఆదివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కుటుంబ కలహాలతో మనసు కలత చెంది పొలం దగ్గరకు వెళ్లి సాయంత్రం ఎవరు లేని సమయంలో వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడం చూసినా కొందరు స్టానికులు 108 కి ఫోన్ చేసి గజ్వేల్ హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో చనిపోయినట్టు తెలిపారు. ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.