06-03-2025 06:38:43 PM
ఇంద్రవెల్లి (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అతివేగం యువకుని ప్రాణాన్ని తీసింది. గురువారం మండలంలోని అర్కాపూర్ గ్రామ సమీపంలో అతివేగంతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ను నడుపుతున్న యువకుడు వినోద్ పై ట్రాక్టర్ పడడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ ని తొలగించి, మృతదేహాన్ని బయటకి తీశారు.