calender_icon.png 11 February, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ బావిలో పడి యువకుడి మృతి

10-02-2025 01:36:00 AM

 కామారెడ్డి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ పరిధిలో వ్యవసాయ బావిలో పడి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివ నగర్ గ్రామానికి చెందిన సిద్ధి రాములు (17) ఆదివారం ఉదయం కాల కృత్యాలు తీసుకోవడానికి గ్రామ శివారు లోని వ్యవసాయ బావి వద్దకు వెళ్ళాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతి చెందాడు. మృతిని తండ్రి గంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.