06-03-2025 12:46:56 AM
హుజూర్ నగర్, మార్చి 5: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతుల గూడెం గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన నందిగామ నరేందర్ (20) అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు మృతదేహాన్ని హుజూర్ నగ ర్ ఏరియా హాస్పిటల్ తరలించి కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు .