ముత్తారం(విజయక్రాంతి): ఆనారోగ్యంతో ముత్తారం మండలంలోని సీతంపేటకు చెందిన బియ్యల హరీష్ (24)గురువారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం హరీష్ గత కొన్ని నెలలుగా ఆనారోగ్యంతో ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ ఇంటి వద్ద ఉండేవాడిని, నాలుగు రోజుల క్రితం గోదావరిఖని ప్రైవేటు దవాఖానలో హరీష్ చికిత్స చేయించుకొని ఇంటికి వచ్చాడని, గురువారం రాత్రి పరిస్థితి విషమించడంతో ఇంటివద్ద నిద్రలోనే మృతి చెందాడని తెలిపారు.