28-02-2025 12:52:09 PM
ఇల్లెందు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ఇల్లెందు - కొత్తగూడెం ప్రధాన రహదారిలో శుక్రవారం తెల్లవారుజామున ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిన సంఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామానికి చెందిన ఈర్ల నరసింహారావు కుమారుడు ఈర్ల భరత్ (19) అనే యువకుడు హైదరాబాద్ లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
హైదరాబాద్ నుంచి ఇల్లందుకు వచ్చి స్వగ్రామం బేతంపూడికి వెళ్లే క్రమంలో ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Yellandu Government Degree College) సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనం పడిఉన్న విషయాన్నీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకొని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే భరత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉంచారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇల్లందుకు చేరుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. ఇల్లందు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.