రాజాపూర్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన అలీ ఈ నెల 3న తన మోటార్ సైకిల్ పై మహబూబ్నగర్ వెళుతున్న క్రమంలో ఏనుగొండ గ్రామ సమీపంలో డివైడర్ కు ఢీకొని తలకు శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడి స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని ఎస్వీఎస్ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అతడికి వైద్యులు గాయాలకు ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతి చెందాడు. అలీ గ్రామంలో మండలంలో పూల విక్రయించి మంచి సత్సంబాలుంధాలు కలిగి ఉండడంతో అతని మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.