నిమజ్జనానికి వెళ్లి నీట మునిగి యువకునికి మృతి
కామారెడ్డి జిల్లాలో విషాదం
కామారెడ్డి,(విజయక్రాంతి): వినాయక నిమజ్జనంలో విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని లింగారెడ్డిపేటలో సోమవారం పదిగంటల సమయంలో వినాయక నిమజ్జనా కార్యక్రమంలో బుజ్జి గారి యేసయ్య(25) అనే యువకుడు గణేష్ నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయాడు. అప్పటివరకు గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమంలో ఎంతో ఉత్సవముగా పాల్గొన్న యేసయ్య మిత్రులతో కలిసి రాత్రి నుంచి తెల్లావారుజాము వరకు కలిసిమెలిసి ఉండి గణేష్ నిమజ్జనాన్ని చేసేందుకు వెళ్లి నిమజ్జనం చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యేసయ్య మృతి చెందడాన్ని మిత్రులు జీర్ణించుకోలేకపోయారు. గజ ఈతగాల్ల సాయంతో విస్తృతంగా వెతికినప్పటికీ సాయంత్రం ఐదు గంటల సమయంలో యేసయ్య శవం లభ్యమై నది. ఈ సంఘటనతో కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. యేసయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక నాయకులు సూచించారు వినాయక నిమజ్జనం వేడుకల సమయంలో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.