కామారెడ్డి జిల్లాలో విషాదం
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యుత్ షాక్ తో ఓ యువరైతు మృతి చెందిన విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన యువరైతు రాజేష్(26) పొలం వద్దకు శనివారం సాయంత్రం వెళ్ళాడు. కోతుల గుంపు వచ్చి పంటను నాశనం చేస్తుండగా కర్రతో వాటిని తరిమి వేస్తుండగా కర్ర విద్యుత్ వైర్లకు తగిలి విద్యుత్ షాక్ వచ్చింది. సమయానికి ఎవరు ఉండకపోవడంతో విద్యుత్ షాకుకు గురై రాజేష్ మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.