calender_icon.png 16 January, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య

10-09-2024 12:56:47 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): మద్యానికి బానిసై ఓ యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లే... చంద్రవెల్లి గ్రామానికి చెందిన కంపెల రాము(28) అనే యువకుడు సెంట్రింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంతకాలంగా రాము సెంట్రింగ్ పనిలో నష్టాలు రావడంతో పని మానేసి కూలీ పని చేసుకుంటున్నాడు. ఇదే క్రమంలో మద్యానికి బానిసై పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.

గత కొంతకాలంగా తాను ఆత్మహత్య చేసుకుని చనిపోతానంటూ ఇంట్లో వాళ్లను బెదిరించాడు. సోమవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని అన్న కంపెల గంగయ్య  తమ్ముడు రాము ఫ్యాన్ కు వెలడడం చూసి బోరున విలపించాడు. దీంతో చుట్టూ పక్కల ఉన్న వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దించి పోలీసులు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని అన్న గంగయ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు తాళ్ల గురజాల ఎస్ఐ చుంచు రమేష్ తెలిపారు.