calender_icon.png 26 February, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘చావు నన్ను వెంటాడుతోంది’

26-02-2025 01:08:29 AM

కోనరావుపేట, ఫిబ్రవరి 25: “కొద్ది రోజులుగా చావు నన్ను వెంటాడుతుంది... యమ ధర్మరాజు పిలుస్తున్నాడు. అమ్మానాన్నా న న్ను క్షమించండి.నేను వెళ్తున్నా..నేటితో నా కథ ముగిసింది. నా చావుకు ఎవరు బాధ్యు లు కాదు. బై.. బై.. “అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కంటనీరు పెట్టిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లం ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల రాకేష్ (19)అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గ్రామానికి చెందిన పొట్ల మం జుల,బాలమల్లు దంపతుల పెద్ద కుమారుడు రాకేష్ ను  ఉన్నత చదువులు చదివించేందు కు హైదారాబాద్ లోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేర్పించారు. వారు స్థానికంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ కష్టపడుతున్న నేపథ్యంలో ఒక్కసా రిగా కొడుకు మృతి వార్తను విని ఆ తల్లితండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరును పలువురిని కంటనీరు పెట్టిస్తుంది.అయితే మూడు రోజుల క్రితం రాకేష్ ఇంటికి ఫోన్ చేసి నాకు చదవాలనిపిస్తలేదని చెప్పగా, ఇం టికి రా ఏదో పనిచేసుకొని బతకొచ్చు అని రాకేష్‌ను ఇంటికి రమ్మన్నారు.

శనివారం రాకేష్ హైదారాబాద్ నుండి లగేజీ సర్దుకొని బయలుదేరి సిరిసిల్ల వరకు వచ్చి ధర్మా రం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కు బ్యాగ్ ఇంటి వద్ద ఇమ్మని చెప్పి వెళ్ళాడు. పేరెంట్స్ ఫోన్ చేయగా స్వి ఆఫ్ రావడంతో సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో రాకేష్ అదృష్యమయ్యాడ ని పిర్యాదు చేశారు. మంగళవారం ఉద యం హైదారాబాద్‌లోని కాచిగూడ రైల్వే ట్రాక్‌పై పడి రాకేష్ ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు పేరెంట్స్‌కు సమా చారం అందించారు.

దీంతో చేతి కందివచ్చిన కొడుకు మృతి చెందాడు అన్న వార్త విని తల్లి దండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పేరెంట్స్ బంధువులు రాకేష్ మృత దేహాన్ని తీసుకువచ్చేందుకు హైదరాబాద్ తరలి వెళ్లారు. రాకేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధి త కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బిజెపి మండలాధ్యక్షుడు మిరియాల్కర్ బాలాజీ కోరారు.