calender_icon.png 17 April, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాహం కావడం లేదని యువకుడి ఆత్మహత్య

08-04-2025 08:37:59 PM

చిట్యాల (విజయక్రాంతి): వివాహం కావడం లేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్యాల ఎస్‌ఐ జి.శ్రావణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంచరామి గ్రామానికి చెందిన తోట లక్ష్మణ్ (28) ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ చిన్నమ్మా ఇంట్లో ఉండేవాడు. అయితే గత కొంతకాలంగా తల్లిదండ్రులు లేరని, చిన్నతనంలోనే చనిపోయారని, తనకంటే చిన్న వారికి వివాహాలు అయ్యానని మనస్థాపానికి గురవుతూన్నాడు.

ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మద్యం సేవించాడు. అదే రోజు రాత్రి ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్ పట్టణంలోని ఎంజీఎం తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి చిన్నమ్మ కూతురు తోట లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.