31-03-2025 01:20:14 AM
అందోల్, మార్చి 30 : మండల పరిధిలోని తాడుమానూరు గ్రామానికి చెందిన చాకలి ప్రవీణ్ (24) తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య పాల్పడినట్టు జోగిపేట ఎస్త్స్ర పాండు తెలిపారు. సదాశివపేట మండలం నిజాంపూర్ కు చెందిన మాధవి తో ప్రవీణ్ కు గత రెండు నెల క్రితం వివాహం జరిగిందని, వివాహం జరిగిన నాటి నుండి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ వస్తున్నాయని తెలిపారు.
కలత చెందిన ప్రవీణ్ ఆదివారం నాడు మధ్యాహ్నం ఇంట్లో నుండి తన పొలం వద్దకు వెళ్లి వేప చెట్టుకు ఉరివేసుకున్నట్టు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.