calender_icon.png 27 April, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

26-04-2025 07:26:18 PM

చేగుంట/నార్సింగి: మనస్తాపంతో యువకుడు ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సింగ్ మండల పరిధిలోని జప్తి శివునూరులో చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం... తుడుం సుధాకర్ (35) నిజాంపేట్ మండలం చల్మెడ వాస్తవ్యుడు. గత 4 సం క్రితం జప్తి శివునూరు గ్రామానికి చెందిన తుడుమ్ అరుణతో వివాహం జరిగింది. పెళ్ళై 4 సంవత్సరాలైనా వీరికి సంతానం కలగలేదు. సుధాకర్ దంపతులకు చల్మెడలో ఒక ఎకరం భూమి ఉండగా జప్తి శివునూరులో కూడా ఒక ఎకరా భూమి ఉంది. బతుకు తెరువు కోసం భార్యా, భర్తలు పనులు చేసుకుంటూ హైదరాబాద్ లో ఉన్నారు. ఏడాది క్రితం శ్రీధర్ దంపతులు అత్త ఊరైన జప్తి శివునూరుకు వచ్చి అక్కడ ఉన్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తున్నారు.

గతంలో శ్రీధర్, చల్మెడ గ్రామంలో తెలిసిన వారి వద్ద అప్పు తీసుకుని తీర్చ లేకపోయాడు. అప్పు తీర్చనందుకు బాధ తొ పాటు, పెళ్ళై ఇన్ని ఏళ్ళయినా పిల్లలు కలగలేదని మనస్తాపం చెందేవాడు, సుధాకర్ శనివారం ఉదయం 8 గం లకు పొలం వద్దకు వెళ్లి వస్తానని భార్యతో చెప్పి బయటకు వెళ్ళాడు.  సమయం 11 గం అయినా భర్త  ఇంటికి తిరిగి రాలేదని అరుణ పొలం వద్దకు వెళ్లి చూడగా పొలంలో ఉన్న చెట్టుకు  తాడుతో ఊరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి, మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రి కి తరలించారు. మృతుని భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ తెలిపారు.