calender_icon.png 2 April, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

31-03-2025 08:15:14 PM

కొండపాక: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. త్రీ టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం... దుద్దెడ గ్రామానికి చెందిన రోడ్డ మల్లేశం (31) టాటా ఏసీ గూడ్స్ వాహనం నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం ఉదయం తన వాహనం టైర్ పంచర్ చేయించుకొని వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లారు. రాత్రి అయిన తిరిగి రాకపోవడంతో మల్లేశం భార్య అనూష, మల్లేశం తండ్రి శంబయ్య తల్లి ఎల్లవ్వ ఎంత వెతికినా ఎలాంటి ఆచూకీ తెలియలేదు. మృతుని బాబాయ్ లక్ష్మణ్ రాత్రి 10 గంటల సమయంలో వ్యవసాయ పొలం వద్ద మోదుగ చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించగా దగ్గరికి వెళ్లి చూసేసరికి మల్లేశం చనిపోయినాడు. మృతునికి భార్య అనూష, కూతురు తన్వి శ్రీ, కొడుకు రియాన్స్ ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు.