06-03-2025 08:01:30 PM
బిక్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో ఒక యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నట్లు తెలిపారు. మద్యానికి బానిస కావడంతో ఇంటిముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకునీ చనిపోయినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.