calender_icon.png 9 February, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త క్రిమినల్ చట్టాలపై యువ న్యాయవాదులు అవగాహన పెంపొందించుకోవాలి...

08-02-2025 11:55:44 PM

పాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. రాజవర్ధన్ రెడ్డి...

ముషీరాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలు బీఎన్‌ఎస్ (ఐపీసీ) బీఎన్‌ఎస్‌ఎస్ (సీఆర్‌పీసీ) భారతీయ ఆధునీయం(ఎవిడెన్స్ యాక్ట్) పైన యువ న్యాయవాదులు పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. రాజా వర్ధన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం దక్షిణ భారత అడ్వకేట్స్ జేఏసీ కార్యాలయంలో యువ న్యాయవాదులకు క్రిమినల్ చట్టాలపై శిక్షనా తరగతులు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాజవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ... యువ న్యాయవాదులు ఈ క్రిమినల్ చట్టాలపై అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా శిక్షణ తరగతులు నిర్వహించిన సీనియర్ న్యాయవాది ఉపాధ్యాయన షాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత అడ్వకేట్స్ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సీబీఐ న్యాయవాది కాసీం సాహెబ్, ఆంజనేయులు, ఓం ప్రకాష్, అశోక్ పంట, మల్లేష్, సతీష్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.