calender_icon.png 17 January, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీఈతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఒప్పందం

17-01-2025 02:43:15 PM

సింగపూర్: విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగ సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(Young India Skills University) సింగపూర్ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటిఈ) సంస్థతో శుక్రవారం నాడు ఎంఓయు కుదుర్చుకుంది. సిఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ జయేశ్ రంజన్ ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటిఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్(ITE Deputy Director Fabian Chiang) ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

సింగపూర్ ఐటిఈ(Singapore ITE) పదో తరగతి చదివే విద్యార్ధుల స్థాయి నుంచి, చదువు పూర్తి చేసిన  యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటి సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణనిస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటిఇ లో ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్లైన్, క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. ఐటిఇకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు నేరుగా శిక్షణనిచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (http://yisu.in) తన శిక్షకులకు ఐటిఇ తో ట్రెయినింగ్ (Training for Trainers) ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటిఇ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాష్ట్రంలో పెట్టుబడులు, వివిధ సంబంధాలను కోరుకునే మొదటి గమ్యస్థానంగా సింగపూర్‌తో తన రెండు దేశాల పర్యటనను ప్రారంభించింది. తాను సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌(Singapore Foreign Minister Vivian Balakrishnan)ను కలిశానని, మౌలిక సదుపాయాల కల్పన, ఇంధనం, గ్రీన్ ఎనర్జీ, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవనం, పర్యాటకం, విద్యలో స్థిరమైన కార్యక్రమాలను కవర్ చేయడానికి విస్తృత, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచడంపై విస్తృత చర్చలతో ప్రారంభించామని రేవంత్ రెడ్డి ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.