ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి):రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. మరో 26 అసెంబ్లీ నియోజక వర్గాల్లో నిర్మాణాలు చేపట్టనున్నది. గతంలో మొదటి దశలో 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుకు అనుమతులు ఇవ్వగా తాజాగా మరో 26 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.
ఈమేరకు విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటే శం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండో దశలో ఏర్పాటు చేయబోతున్న వాటిలో బోదన్, పెద్దపల్లి, డోర్నకల్, సత్తుపల్లి, వైరా, కోదాడ, కొత్తగూడెం, నకిరేకల్, నాగార్జునసాగర్, తాండూర్, మక్తల్, రామగుం డం, నారాయణపేట, జుక్కల్, చొప్పదండి, కల్వకుర్తి, నిజామాబాద్ రూరల్, వనపర్తి, చేవేళ్ల, జగిత్యాల, వికారాబాద్, గద్వాల, ధర్మపురి, మెదక్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో నిర్మించనున్నారు.