calender_icon.png 25 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్

22-10-2024 01:28:27 AM

ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పోలీసు, పోలీసు అమర వీరులు, ఇతర యూనిఫాం సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌ల సిబ్బందికి చెందిన పిల్లల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ స్కూళ్లో పోలీసు పిల్లలతోపాటు ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎక్సైజ్, ఎస్‌పీఎఫ్, జైళ్ల శాఖ సిబ్బంది పిల్లలకు అడ్మిషన్లు కల్పించనున్నారు. ఈ పాఠశాల ఏర్పాటుకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీ చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ స్కూల్‌లో క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య, విద్యార్థులకు మంచి విలువలు నేర్పేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వసతులు కల్పించనున్నారు. హాస్టల్ వసతి, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇందులో ఏర్పాటు చేయనున్నారు.