నల్లగొండ (విజయక్రాంతి): నకిరేకల్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల మంజూరైనట్లు ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. శనివారం నకిరేకల్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో అన్నివర్గాల విద్యార్థులు కులమతాలకు అతీతంగా ఒకేచోట చదువుకునేలా ఈ పాఠశాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 5 వేల కోట్ల వ్యయంతో 28 ప్రాంతాల్లో భవన నిర్మాణాలకు శంకుస్థాపన సైతం చేసినట్లు గుర్తు చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు వైఐఐఆర్ పాఠశాలను మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.