calender_icon.png 27 September, 2024 | 12:53 PM

ఆసీస్ భరతం పట్టిన యువ భారత్

27-09-2024 12:00:00 AM

అండర్-19 వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్

పుదుచ్చేరి: స్వదేశంలో జరిగిన అండర్- 19 వన్డే సిరీస్‌లో యువ భారత్.. ఆస్ట్రేలియా జట్టును వైట్‌వాష్ చేసింది. గురువారం జరిగిన మూడో వన్డేలో భారత అండర్-19 జట్టు ఏడు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసుకుంది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌ను భారత యువ జట్టు 3-0 తో క్లీన్‌స్వీప్ చేసింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 324 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రుద్ర పటేల్ (77), కెప్టెన్ అమాన్ (71) రాణించారు. ఆసీస్ బౌలర్లలో కాన్నర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ 50 ఓవర్లు పూర్తయ్యే సరికి 7 వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఒలివర్ పీక్ (111), హొగన్ (104) సెంచరీలు చేసినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. భారత బౌలర్లలో హార్దిక్ రాజ్ 3 వికెట్లు, కిరణ్ రెండు వికెట్లతో సత్తా చాటారు. సెంచరీతో మెరిసిన పీక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.