calender_icon.png 25 December, 2024 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-1కు ప్రిపేరవుతున్న యువతి ఆత్మహత్య

24-12-2024 05:37:48 PM

ఎలారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సోమారం తండాకు చెందిన గ్రూప్-1 విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్లోని చిక్కడపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమారం తండాకు చెందిన సురేఖ వాణి గ్రూప్-1 పరీక్ష కోసం హైదరాబాద్లోని అశోక్ నగర్ లో ఉంటూ సన్నద్ధమవుతోంది. ఆమెకు నిజామాబాద్ కు చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 7న ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి సురేఖ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా విద్యార్థిని మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు.