ఫిబ్రవరి 16న ప్రదానం
హైదరాబాద్, డిసెంబర్ 28 (విజయక్రాంతి): సుచిరిండియా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన సర్ సీవీ రామన్ ఒలంపియాడ్ పేరుతో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించింది. ఈ పరక్షకు దేశంలోని 560 కేంద్రాల నుంచి 75వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ఇందులో ముందు వరుసలో నిలిచిన విద్యార్థులకు యంగ్ జీనియస్ అవార్డులను ఫిబ్రవరి 16న నాంపల్లిలోని లలిత కళాతోరణంలో అందించనున్నట్టు సుచిరిండియా సంస్థ వ్యవస్థాపకుడు లయన్ డాక్టర్ వై.కిరణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.