18-03-2025 10:19:43 PM
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యుత్ ఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ఊత్తూరులో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సతీష్ మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో మందు కొట్టేందుకు వెళ్ళాడు. నీళ్ల కోసం బావీలోకి దిగారు. వైరు తెగిపోయి బావి నీటిలో పడటంతో నీళ్లకు షాక్ రావడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని భార్య లతా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివ నగర్ పోలీసులు తెలిపారు.