calender_icon.png 29 March, 2025 | 7:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోరు ఇంకిపోయిందని యువరైతు ఆత్మహత్యాయత్నం

26-03-2025 12:33:01 AM

48గంటలవరకూ ఏమీ చెప్పలేమంటున్న వైద్యులు

పెబ్బేరు మార్చి 25: మండల పరిధిలోని అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన యువరైతు కురుకుంట్ల శ్రీకాంత్ మంగళవారం తెల్లవారుజామున ఆత్మ హత్యాయత్నం చేసారు.యువరైతు శ్రీకాంత్ కు స్థానికంగా 15ఎకరాల భూమి ఉంది. అందులో బోరు వేసి 6ఎకరాలలో బత్తాయి తోట సాగుచేస్తున్నారు.

గత కొన్ని రోజుల క్రితం తన వ్యవసాయ భూమికి ప్రక్కనే ఉన్న స్తానిక రైతు జంపుల్ బుచ్చారెడ్డి పొలంలో ముప్పు అడుగుల దూరం లోబోరు వేసారు. ఆయన బోరు వేయటంతో శ్రీకాంత్ బోరు ఇంకిపోయి బత్తాయి తోట కునీరుఅందకపోవటంతో తీవ్ర ఆందోళన చెందారు. ఇట్టి విషయం పై గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడినా ఫలితం లేకపో యిందని వీడియో లో ఆవేదన వ్యక్తం చేసారు.

నేటి తెల్లవారుజామున సెల్ఫీ వీడియో తీసుకుని స్తానిక వాట్సాప్ గ్రూప్ లో పోస్టు చేసిన అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసారు. హుటాహుటిన పెబ్బేరు కు తరలించారు. స్థానికంగా ఉన్న మూడు ఆసుపతృలలో ప్రయత్నం చేయగా వారు కర్నూలు కు రెఫర్ చేసారు. అంబులెన్స్ లో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు.

గత పది సంవత్సరాల క్రితం చార్టెడ్ అకౌంట్ చదువు పూర్తి చేసి ఉద్యోగం వైపు వెళ్లకుండా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబానికి బాసటగా నిలవటంతో గ్రామంలో శ్రీకాంత్ యువత కు ఆదర్శంగా నిలిచారు. ఆత్మ హత్య కు ముందు తీసిన సెల్ఫీ వీడియో అందరినీ కంటతడి పెట్టిస్తుంది. తను చనిపోతే తన రూపాన్ని తోటరూపంలో చూసూకో నాన్న అనటం అందరినీ కలిచివేసింది. త్వరగా కోలుకోవాలని ప్రజలు భావిస్తున్నారు.