వైద్యురాలికి తీవ్ర గాయాలు అదుపుతప్పి డివైడర్ పై ఉన్న పోల్ ను ఢీకొట్టిన కారు
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 1 : అతివేగానికి ఓ యువ వైద్యుడు బలి అవ్వగా మరో వైద్యురాలికి తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారు జామున సుమారు 4.30 గంటల సమయంలో ఎల్ బి నగర్ లో ఉన్న కామినేని హాస్పిటల్ లో హౌస్ సర్జన్ గా పని చేస్తున్న బాచుపల్లికి చెందిన వి. జస్వంత్(24), అదేవిధంగా ఎల్ బీనగర్ లో నివాసం ఉంటున్న భూమిక అనే మరో హౌస్ సర్జన్ కలిసి శంకర్పల్లి లో ఓ వివాహ వేడుకకు హాజరై ఏకో స్పోరట్స్ కార్‌లో తిరుగు ప్రయాణమయ్యారు.
మార్గమధ్యలో ఖానాపూర్ సమీపంలో వేగాన్ని అదుపు చేయలేక రోడ్ మధ్యలో డివైడర్ పైన ఉన్న హార్డింగ్ పోల్ ని కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కార్ ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యి డ్రైవింగ్ సీట్ లో ఉన్న జశ్వంత్ అక్కడికక్కడే చనిపోయాడు.
డ్రైవర్ సీట్ పక్క సీట్ లో కూర్చొని ఉన్న భూమిక కి బలమైన రక్త గాయాలు అవ్వడంతో స్థానికుల సమాచారంతో నార్సింగి పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను చికిత్స నిమిత్తం అంబులెన్సులో గచ్చిబౌలిలోని కాంటినెంట్ హాస్పిటల్‌కు తరలించారు. జస్వంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.