calender_icon.png 18 April, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

15-04-2025 05:54:45 PM

ఐసిడిఎస్ సిడిపిఓ రేష్మ..

లక్షెట్టిపేట (విజయక్రాంతి): చిన్నపిల్లలకు పౌష్ఠికాహారం అందించాలని ఐసిడిఎస్ సిడిపిఓ రేష్మ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో ఏర్పాటు చేసిన చిన్న పిల్లల పోషకాహార అవగాహన కార్యక్రమంలో చంటి పిల్లల తల్లులకు, పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో వివరించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపీఓ రేష్మ మాట్లాడుతూ.. పోషన్ పక్షం 2025 పోషణ్ అభియాన్ లో భాగంగా ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు. అతి తీవ్ర పోషకాహార లోపం ఉన్న పిల్లలను వెంటనే గుర్తించి పునరావాశ కేంద్రానికి తరలించనున్నట్లు ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మమత, పంచాయతీ సెక్రెటరీ సునీత, అంగన్వాడీ టీచర్లు ప్రేమలత, అలివేణి, చంటి పిల్లల తల్లులు, గ్రామ మహిళలు, పాల్గొన్నారు.