calender_icon.png 15 March, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్‌రూబా చూశాక థ్రిల్ అవుతారు

14-03-2025 12:00:00 AM

కిరణ్ అబ్బవరం, విశ్వకరుణ్ కాంబోలో రూపొందిన సినిమా ‘దిల్ రూబా’. ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నేడు విడుదల కానుంది.

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా గురువారం చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ నిర్వహించింది. దీనిలో భాగంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “దిల్ రూబా’ ఫస్ట్ 30 మినిట్స్ సరదగా వెళ్తూ ఆ ముప్పు నిమిషాల తర్వాత కథలోకి తీసుకెళ్తుంది. ఈ కథలో ప్రేమ ఒక్కటే కాదు స్నేహం, ఫాదర్ సన్, ఫాదర్ డాటర్ రిలేషన్..ఇలా అన్ని ఎమోషన్స్ ఉంటాయి.

ఎక్స్ లవర్ మళ్లీ ఆ ప్రేమికుడి జీవితంలోకి వచ్చి అతని ప్రెజెంట్ లవ్‌ను కలిపే ప్రయత్నం చేయడం అనేది కొత్తగా ఉంటుంది. ఈ మూవీ చూశాక థ్రిల్ అవుతారు. మాజీ ప్రేయసి, ప్రేమికుడు అంటే శత్రువుల్లా చూడాల్సిన పనిలేదు. వారితోనూ స్నేహాన్ని కొనసాగించవచ్చు అనే ఫీల్ గుడ్ ఎలిమెంట్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది” అన్నారు.

డైరెక్టర్ విశ్వకరుణ్ మాట్లాడుతూ.. “-మనం ఏ వార్త చూసినా మనుషుల మధ్య తగ్గిపోయిన విలువలు, బంధాల గురించే ఉంటున్నాయి. అవి చూశాక ‘దిల్ రూబా’ లాంటి కథ రాయాలని అనిపించింది. కిరణ్ గారిని ఈ సినిమాలో కొత్తగా చూస్తారు” అన్నారు. హీరోయిన్ క్యాతీ డేవిసన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మ్యాగీ క్యారెక్టర్ చేశాను. ఇలాంటి మంచి రోల్ తో మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. సినిమా చూశాక ఎమోషనల్ ఫీల్ అవుతారు” అని పేర్కొంది.