calender_icon.png 29 December, 2024 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దెబ్బలు పడుతాయ్ రాజా..!

29-12-2024 03:20:57 AM

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పుష్ప-2 సినిమాలోని ‘దెబ్బలు పడుతాయ్’ పాట తెగ వైరల్ అవుతోంది. సినిమా ఈవెంట్లు, బౌన్సర్ల తీరుపై ప్రభుత్వం ఇండస్ట్రీకి స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో చిత్ర పరిశ్రమలో చర్చ ప్రారంభమైంది. బౌన్సర్లు అతి చేసినా.. మూవీ ఫంక్షన్లు, ఈవెంట్లలో అభిమానులు రెచ్చిపోయినా.. హీరోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పడంతో.. ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. ఇక మీద తప్పు జరిగితే.. ‘దెబ్బలు పడుతాయ్ రాజా.. దెబ్బలు పడుతాయ్‌రో’ అంటూ నెట్టింట మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. 

 కొడవలికంటి నవీన్