calender_icon.png 20 March, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలాంటి భయలు లేకుండా నిర్భయంగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి

19-03-2025 08:36:48 PM

ఓదెల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పోలీసులు..

మీకోసం కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్...

పెద్దపల్లి: విద్యార్థులు ఎలాంటి భయలు లేకుండా నిర్భయంగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఓదెల మండలంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులతో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. పుత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, పరీక్ష సామాగ్రి పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీసీపీ పాల్గొన్నారు. పరీక్ష సామగ్రి పరీక్ష ప్యాడ్స్, కంపాస్ బాక్స్, పెన్స్ ను డిసిపి కర్ణాకర్, పెద్దపల్లి ఎసిపి గజ్జి కృష్ణ  చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్బంగా డీసీపీ మాట్లాడుతూ.. పరీక్షల సమయం దగ్గర పడే కొద్ది విద్యార్థులలో ఆందోళన ఉంటుందని భయం ఆందోళన విడి ఆత్మవిశ్వాసం ఉంటే అంతిమ విజయం మీ సొంతం అని డిసిపి అన్నారు. విద్యార్థులు నిర్భయంగా ఎలాంటి భయాలకు, ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో వార్షిక పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో పదవ తరగతి ఒక మొదటి మెట్టుగా భావించి చదువు చెప్పిన గురువులకు కన్న తల్లిదండ్రులకు మనం పుట్టి పెరిగిన ఊరికి పేరు తీసుకురావాలని, విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేదనకు గురికాకూడదని, మంచి ఆలోచనతో చదువుకోవాలని డీసీపీ సూచించారు. కనగర్తి, ఓదెల, పోత్కపల్లి మండలాలకు చెందిన యువతకి వాలీబాల్ కిట్స్ అందజేశారు. డిసిపి, ఏసిపితో పాటు పోలీసులు, విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. 

ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్, సిబ్బంది, వై రమేష్ ఎంఈఓ హరి ప్రసాద్, జిహెచ్ఎంఈఓ జి అంజన్ కుమార్, అనిత సైకియాట్రిస్ట్, లక్ష్మీనారాయణ ఇన్చార్జ్ హెచ్ఎం జెడ్ పి హెచ్ ఎస్ ఓదెల, బి సాంబయ్య జిహెచ్ఎంపిహెచ్ఎస్ పోత్కపల్లి, ఎన్ ఏసుదాసు జిహెచ్ఎం జడ్.పి.హెచ్.ఎస్ కొలనూరు, వై రమేష్ జిహెచ్ఎం జడ్పిహెచ్ఎస్ కనగర్తి, ఈ జె సర్వోత్తమ్ రెడ్డి ఇన్చార్జి హెచ్ఎం జడ్.పి.హెచ్.ఎస్ గుంపుల, జి శ్రీనివాస్ ప్రిన్సిపల్ మోడల్ స్కూల్, కే జ్యోతి కేజీబీవీ స్కూల్ ఓదెల, మరియు టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.