calender_icon.png 28 October, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవి తెలిస్తేనే డేటింగ్ చేయాలి

03-07-2024 12:05:00 AM

నివేతా పేతురాజ్.. ఓ తమిళ సోయగం. నటిగానే కాక ఎఫ్1 కార్ రేసర్‌గా, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గానూ పతకాలు సాధించి ఆ రంగాల వారికి సుపరిచితమైంది. టాలీవుడ్‌లో ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరు రా’, ‘రెడ్’, ‘పాగల్’, ‘అలవైకుంఠపురంలో’, ‘దాస్ కా ధమ్కీ’ వంటి పలు సినిమాల్లో నటించటం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన ఈ భామ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘పరువు’ వెబ్ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంటోంది. అయితే ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పటం ద్వారా తన మర్మాన్ని బయటపెట్టింది.

‘జీవితంలో ఒక్కసారి గతంలోకి వెళ్తే మీకు మీరు ఎలాంటి సలహా ఇచ్చుకుంటారు?’ అని అడిగితే వయసుకు దగ్గ ముచ్చటే చెప్పింది. ‘డేటింగ్ చేసే ముందు ఆ అబ్బాయి గురించి అన్ని విషయాలూ బాగా తెలుసుకోవాలి. ముందు స్నేహం చేసి ఆ తర్వాతే డేటింగ్ చేయాలి’ అని తెలిపింది. దీనికి కొనసాగింపుగా మరో ప్రశ్నను సంధిస్తే మరింత వివరంగా డేటింగ్ గురించి చెప్పుకొచ్చింది నివేతా.

ఇంతకీ డేటింగ్ గురించి ఈ అమ్మడు చెప్పిన విషయమేంటంటే.. ‘లవ్, డేటింగ్ ఈరోజుల్లో అందరూ చేస్తున్నారు. సింగిల్‌గా ఉండటానికి భయపడుతున్నారు.. ఆలోచిస్తున్నారు’ అని తెలిపింది. ప్రేమ, సహజీవనం గురించి నివేతా ఇంత బాగా చెప్పిందంటే.. ఇది తన అనుభవంతోనే అని భావిస్తూ.. ఈ అమ్మడు లవ్ ఫెయిల్యూర్ కావొచ్చనీ, ఇంతకీ ఆ అబ్బాయి ఎవరై ఉంటారని చర్చించుకుంటున్నారు.