మన ఎదుగుదలతో వ్యక్తి త్వం ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆప్త (అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన వేడుకకు చిరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో చోటుచేసుకున్న ఆసక్తి కర విషయాలను పంచుకున్నారు.
“నేను నో వేర్.. అనే స్థాయి నుంచి సమ్ వేర్ అనే స్థాయికి వచ్చానంటే నన్ను నేను మలుచుకున్న విధానమే కారణం. ప్రతికూల పరిస్థితులను దాటి అనుకూల పరిస్థితులను ఏర్పాటు చేసుకుని, ఎలా ఎదుగుతూ వచ్చాననేది చెబితే చాలు.. చాలా మందిని ఆలోచింపజేస్తుందనిపించింది. ఎన్టీ రామారావు గారి నిర్మాతలు నాతో సినిమాలు చేస్తున్నారం టే నేను నెంబర్ వన్ హీరో అయ్యాననిపించింది.
నంబర్ వన్ అయ్యానని కాలర్ ఎగరేస్తే ఏమవుతుందో కూడా నాకు తెలుసు.. అందుకే అణిగిమణిగి ఉండాలని, కష్టపడి పనిచేశాను. కష్టపడితే ఆ నెంబర్ అలాగే ఉంటుంది తప్ప ఎక్కడికీ పోదు. ఇండస్ట్రీలో టాలెంట్‌తోపాటు, చక్కటి ప్రవర్తన కూడా ఉండాలి. పరిస్థితులను అనుకూలంగా మార్చకుంటూ నేను ఎదిగాను” అని చిరంజీవి తెలిపారు.