నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉంటా
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
న్యూఢిల్లీ, నవంబర్ 15: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో పని గంటలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటిని వెన క్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. శుక్రవారం సీఎన్బీసీ గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చా రు. ప్రతి ఒక్కరూ వారంలో దాదాపు 70 గంటలపాటు పనిచేయాలని మరోసారి తేల్చిచెప్పారు. దేశానికి ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ వారంలో 100 గంటలు పనిచేస్తున్నారు.
మనం కూడా కష్టపడి పనిచేయడమే ఆయనకు ఇచ్చే ప్రశంస అని నారా యణమూర్తి సూచించారు. వారంలో ఆరు పనిదినాలను ఐదురోజులకు మార్చినపుడు తాను తీవ్ర నిరాశ చెందానని ఆయన వెల్లడించారు. తన జీవితంలో చాలాకాలం పా టు రోజులో 14 గంటలు, వారంలో ఆరున్న ర రోజులు పనిచేసినట్లు ఆయన తెలిపారు.