calender_icon.png 2 October, 2024 | 4:06 AM

కబ్జాల అంతు చూడాల్సిందే..

10-09-2024 04:27:38 AM

  1. ఖమ్మంలో అక్రమ నిర్మాణాలు కూల్చేయండి
  2. ప్రభుత్వం స్పందించకపోతే మేమే కూల్చివేస్తాం 
  3. చెరువుల ఆక్రమణలపై జనం ఆగ్రహం
  4. బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయని ఆరోపణ 

ఖమ్మం, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం నగరాన్ని వరదలు ముంచెత్తడంతో చెరువులు, కుంటల ఆక్రమణలపై నగర ప్రజలు ఆగ్రహ ం వ్యక్తం చేస్తున్నారు. చెరువు భూముల్లో చే పట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించి, కబ్జాదారులపై చర్యలు తీసుకుని ఖమ్మం నగరాన్ని కాపాడాలని ఆందోళనలకు దిగుతున్నారు. బీఆర్‌ఎస్ హయాంలోనే చెరువులు, కాల్వలు, నాలాలు, మురుగు కాల్వలు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. వందల ఏళ్ల నాటి గొలుసుకట్టు చెరువుల ఆనవాళ్లు లేకుం డా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఆక్రమణలో చెరువులు

ఖమ్మం నగరంలో అంతర్భాగంగా ఉన్న ఖానాపురం చెరువు, నగరం నడిబొడ్డున ఉ న్న లకారం చెరువు, ధ్వంసలాపురం చెరువు లు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. ఖానాపురం చెరువు నిండిన తర్వాత అక్కడి నుంచి కాల్వల ద్వారా వరద నీరు లకారం చెరువుకు చేరుకుని, అక్కడి నుంచి ధ్వంసలాపురం చెరువుకు, అటు నుంచి మున్నేరులోకి వెళ్లే విధంగా వందల ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో వీటిని నిర్మించారు. కానీ బడాబాబులు ఆ చెరువులన్నింటినీ ఆక్రమించి రియ ల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. బఫర్, ఎఫ్‌టిఎల్ జోన్‌లోనే అక్రమ కట్టడాలు చేపట్టారు. 

300ఎకరాల నుంచి 30ఎకరాలకు లకారం చెరువు

300 ఎకరాలకు పైగా ఉన్న లకారం చెరు వు నేడు 30 ఎకరాలకు మించి కూడా ఉండ దు. గత ప్రభుత్వ హయాంలో సుందరీకరణ పేరుతో లకారం చెరువు ఆనకట్ట ఎత్తు పెం చి, వరద నీటి కాల్వలకు తిలోదకాలు ఇచ్చా రు. దీంతో వరద నీరు ఇళ్లలోకి వస్తున్నది. కొందరు అక్రమార్కులకు 99 ఏళ్ల లీజుకు లకారం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ భూ మిని కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. దీంతో వారు ఎఫ్‌టీఎల్ పరిధిలో భారీగా నిర్మాణాలు చేపట్టడంతో చెరువు ఆకారం కోల్పోయి, విస్తీర్ణం తగ్గింది. 

అన్యాక్రాంతమైన ఎన్‌ఎస్పీ భూములు 

విలువైన ఎన్‌ఎస్పీ కాల్వ భూములు కూ డా అన్యాక్రాంతమయ్యాయి. నగరం విపరీతంగా విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో అక్రమార్కుల దృష్టి ఎన్‌ఎస్పీ భూములపై పడి, కాల్వ ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. రాజకీయ నా యకులు సైతం ఎన్‌ఎస్పీ కాల్వ భూములను ఆక్రమించి, గత ప్రభుత్వ హయాంలో రెగ్యులైజేషన్ చేయించుకున్నట్లు ఆరోపణలున్నా యి. నగరంలో మెడికల్ కాలేజీకి చెందిన ప్రైవేట్ ఆసుపత్రి, ఆ పక్కనే ఉన్న ప్రముఖ ప్రైవేట్ స్కూళ్ల కింద ఎన్‌ఎస్పీ కాల్వ ఎకరాల భూములున్నాయి. అయినా పట్టించుకునే దిక్కులేకుండాపోయి. 

ప్రభుత్వం స్పందించాల్సిందే

ప్రభుత్వం, అధికారులు స్పందించి అక్ర మ కట్టడాలను తొలగించకపోతే తామే జేసీబీలతో తొలగించి తమ ప్రాంతాలను రక్షిం చుకుంటామని ఖమ్మం ప్రజలు తేల్చి చెబుతున్నారు. గత 10 ఏళ్లలోనే చెరువులు, కాల్వ ల ఆక్రమణలు ఎక్కువగా జరిగాయంటున్నారు. ఎన్‌ఎస్పీ కాల్వ భూములు ఆక్రమణలపై గతంతో నోటీసులు ఇచ్చి, ఇళ్లకు మార్కింగ్ చేసి చేతులు దులుపుకున్నారని మండిపడుతున్నారు. ఆ తర్వాత చాలా మంది హైకోరును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అక్రమార్కులకు ఇష్టానుసారంగా అనుమతులు ఇవ్వడంతోనే విపత్తుకు కారణమైంద ని విమర్శిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. కాల్వ భూముల్లో చేపట్టిన కట్టడాలను తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. 

ఐస్ ఫ్యాక్టరీ కూల్చివేత

ఖమ్మం జిల్లా కోర్టు సమీపం లోని నాగార్జున ఫంక్షన్‌హాల్ వెనుక ఉన్న  కాలువను కబ్జా చేసి నిర్మించిన ఐస్   ఫ్యాక్టరీ ని నగర పాలక సంస్థ అధికారులు  సోమవారం రాత్రి జేసీబీలతో కూల్చి వేశారు. ఫ్యాక్టరీలోని ఆమోనియం గ్యాస్ విడుదల కావడంతో చుట్టు పక్కల ఉండే ప్రజలు ఇబ్బంది పడ్డారు.

130 అడుగుల కాల్వ 30 అడుగులకు

ఖానాపురం చెరువు నుంచి లకారం చెరు వు మీదుగా ధ్వంసలాపురం చెరువు వరకు నిర్మించిన 130 అడుగుల విస్తీర్ణంలో ఉన్న కాల్వ కూడా ఆక్రమణకు గురై ఆనవాళ్లు లే కుండా పోయింది. కాల్వను ఆక్రమించి ని ర్మాణాలు చేపట్టడంతో 30 అడుగులకు చేరి ంది. ఈ కాల్వ ఖానాపురం చెరువు నుంచి ధ్వంసలాపురం చెరువుకు చైతన్యనగర్, కవిరాజ్‌నగర్, వరదయ్య నగర్, మమత ఆసు పత్రి రోడ్ సంభానినగర్ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. పాత మ్యాపులను పరిశీలిస్తే ఈ కాల్వ పూర్తి వివరాలు తెలుస్తాయి.

ఇప్పుడు ఏకంగా కాల్వను ఆక్రమించి అపార్ట్‌మెంట్లు, భవనాలు నిర్మించుకున్నారు. ఐస్ ప్యాక్టరీ కూడా నిర్మించారు. బీఆర్‌ఎస్ హయాంలోనే భారీగా ఆక్రమణలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులకు, నాయకులకు ముడుపులిచ్చి భూములను కాజేశారని ఆరోపిస్తున్నారు. దీంతో భారీ వర్షాలకు కవిరాజ్‌నగర్, చైతన్యనగర్, వరదయ్యనగర్ వరద నీటి మునిగింది. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చేశారు.

మున్నేరులో తగ్గిన వరద ఉధృతి

వరదలు మిగిల్చిన భారీ నష్టం నుంచి కోలుకోకముందే ఎగువున కు రిసిన వర్షాలకు ఖమ్మంలో మున్నేరు కు శనివారం రాత్రి నుంచి వరద ఉ ధృతి పెరిగింది. సోమవారం ఉదయ ం 16 అడుగులతో మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించిన మున్నే రు ఆ తర్వాత నుంచి కొద్దికొద్దిగా త గ్గుతూ వచ్చింది. సాయంత్రంకల్లా వ రద నీటి మట్టం 11 అడుగులకు చేరడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పునరవాస కేంద్రాల నుంచి ప్రజలు ఇళ్ల దారి పట్టారు. వా తావరణ కేంద్రం మాత్రం మరో రెం డు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పడంతో ఒకింత భయాందో ళన చెందుతున్నారు.