calender_icon.png 28 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించాలి!

28-02-2025 01:50:32 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్
  2. బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు 
  3. రేవంత్ గాలి మాటలను ప్రజలు గమనిస్తున్నారు 
  4. నేను రాష్ట్ర ప్రజలకు మాత్రమే జవాబుదారీనని వ్యాఖ్య

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): రాష్ట్రానికి మెట్రో రైల్ రాకుండా అడ్డుకుంటున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే తాను ఏ ప్రాజెక్టునైనా అడ్డుకున్నట్టు నిరూపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి బెదిరింపు రాజకీయాలు చేస్తే.. భయపడేవారెవరూ లేరని స్పష్టంచేశారు.

గురు వారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్‌రెడ్డి చేతగాని, దమ్ములేని ముఖ్యమంత్రి. అన్నీ మాట లు చెప్పి, చేతులు దులుపుకొనే ప్రయ త్నం చేస్తున్నారు. ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే ఎలాంటి ఆర్థిక ప్రణాళిక అవ సరమో కూడా ఆయనకు తెలియదు. సరైన కార్యాచరణ వారి వద్ద లేదు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎలా డబ్బులు తెచ్చుకుంటారో కూడా ఆయనకు స్పష్టత లేదు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

‘మెట్రో ప్రాజెక్టు కు అనుమతులు ఇవ్వాలంటూ ఇటీవల కేంద్రానికి ఫైల్ పంపారు. అది అన్ని మంత్రిత్వశాఖలకు సర్క్యూలే ట్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఇలా పంపగానే అలా అయిపోదు, దాని కో విధానం ఉంటుంది. ముఖ్యమం త్రి స్థాయిలో ఉండి ఎలాంటి అవగాహన లేకుండా దుందుడుకుగా మా ట్లాడటం సరికాదు’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

ఎన్నికల్లో మమ్మల్ని అడిగి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారా? ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే అభివృద్ధి పనులు చేస్తానని, ప్రాజెక్టులకు రూపకల్పన చేశారా? రాష్ట్రాలు ఇలా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చే యడం ఎంతవరకు సబబు.. అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అనేక ప్రాజె క్టులను ఎప్పటికప్పుడు వివిధ విభాగాలతో మాట్లాడి ఉత్తరాలు రాస్తూ అభివృద్ధి పనులు ముందుకుసాగేలా చూస్తున్నట్టు చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు రేవంత్‌రెడ్డిని న మ్మి అధికారమిస్తే.. ఇప్పుడు గాలిమాటలు మాట్లాడుతున్నారని, ప్రజ లు అన్ని విషయాలను గమనిస్తున్నారని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో పార్లమెంట్‌కు రాలేదన్నారు. తెలంగాణ ప్రజలకు మాత్రమే తను జవాబుదారీనని.. రే వంత్‌రెడ్డి మాటలకు కాదని కిషన్‌రె డ్డి స్పష్టం చేశారు.