calender_icon.png 2 November, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోజుకోసారైనా నవ్వాల్సిందే.!

13-07-2024 01:56:02 AM

జపాన్‌లో వెరైటీ చట్టం

టోక్యో, జూలై 12 :  జపాన్ ప్ర భుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రతిరోజూ కనీ సం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ చట్టాన్ని రూపొందించింది. జపాన్‌లోని యమగట ప్రిఫెక్చర్ ప్రభుత్వం గతవారం నుంచే ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. య మగట యూనివర్సిటీ పరిశోధన ల్లో నవ్వు మంచి ఆరోగ్యాన్ని అం దించగలదని తేలడంతో అక్కడి ప్ర భుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వేలా ఈ చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకా రం ప్రతినెలా 8న లాఫింగ్ డేగా జరుపుకోవాలని సూచించింది.

నవ్వడం ద్వారా రకరకాల కారణాలతో దారితీస్తున్న మరణాలు, హృద్రోగాల ప్రమాదం తగ్గుతుందని వెల్లడించింది. నవ్వడం అనేది మనుషుల్లో సమర్థత, విశ్వాసం నింపుతుందని అధ్యయనం తేల్చి చెప్పింది. అయితే, ఈ చట్టాన్ని జపాన్‌లోని కొంతమంది రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తు న్నారు. ఇది ప్రజల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుందని వస్తు ందని విమర్శిస్తున్నారు. నవ్వడం వారి అంతర్గత ఆలోచన, స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, పైగా ఇది ప్రాథమిక హక్కుల్లో ఒకటని జపనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (జేసీపీ) నేత టోరు సెకి అన్నారు. ఈ కొత్త నిబంధన ప్రకారం రోజుకు ఒక్కసారైనా నవ్వలేనివారికి జరిమానా విధించే ఆలోచన లేదని, ఇది ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం కోసం రూపొందించిన చట్టమని అధికారులు అన్నారు.