calender_icon.png 19 October, 2024 | 7:07 AM

ఆఫీస్‌కు రావాల్సిందే

19-10-2024 02:36:41 AM

ఇష్టం లేని వారు ఉద్యోగం మానుకోండి

ఉద్యోగులకు అమెజాన్ ఆదేశాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: వర్క్ ఫ్రమ్ హోమ్‌ను వదిలి ఉద్యోగులు ఆఫీసులకు రావాలంటూ పలు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగులకు పిలుపునిస్తున్నాయి. దీంతో చాలామంది ఉద్యోగులు ఇప్పటికే ఆఫీసుకు వచ్చి పనిచేస్తుండగా మరికొందరు మాత్రం ఇంటి నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నారు. కాగా వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈఓ మాట్ గార్మార్ పేర్కొన్నారు. వారానికి ఐదు రోజులు ఆఫీస్‌కు వచ్చి పని చేయాలని, ఇష్టం లేనివారు ఉద్యోగం వదిలేయొచ్చని తమ కంపెనీ ఉద్యోగులను ఆదేశించారు. ఇటీవల అమెజాన్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మాట్లాడిన గార్మాన్.. వారంలో 5 రోజులు కచ్చితంగా ఆఫీస్‌కు వచ్చి పనిచేయాలని సూచించారు. 10 మంది ఉద్యోగుల్లో 9 మంది ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఆఫీస్ వాతావరణంలో పనిచేయడానికి ఇష్టపడని వారికి ఇతర కంపెనీలు ఉన్నాయంటూ గర్మాన్ హెచ్చరించారు. అమెజాన్ సీఈఓగా యాండీ జెస్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించారు. వారంలో మూడు రోజులు తప్పనిసరిగా ఆఫీస్‌కు రా వాలని ఆదేశించిన ఆయన.. కంపెనీలో ఆవిష్కరణలను మెరుగుపర చడానికి 5 రోజులు ఆఫీస్‌కు రావాలని గత నెలలో ప్రకటించారు. ప్రస్తుతం అమెజాన్ వారానికి 3 రోజుల విధానాన్ని అమలు చేస్తుంది. వచ్చే ఏడాది నుంచి వారానికి 5 రోజుల నిబంధనను అమలు చేయాలని భావిస్తున్నారు.