calender_icon.png 12 March, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాగైనా రావాల్సిందే!

22-12-2024 01:22:07 AM

అధికారం కోల్పోయాక ఫాం హౌస్‌కే పరిమితమైన గులాబీ బాస్‌ను అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ నేతలు ఆటాడుకుంటున్నారు. ఒక్కసారి అధికారం రాక పోతే ప్రజలను పట్టించుకోరా? అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే, అసెంబ్లీకి పోకపోయినా కాళేశ్వరం విచారణకు వెళ్లక తప్పదని దెప్పిపొడుస్తున్నారు.

కాళేశ్వరంలో భాగమైన ఇంజినీరింగ్ అధికారులు, ఐఏఎస్‌లు, సాగునీటి పారుదల నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, కేంద్ర సాగునీటి రంగ సంస్థలను కాళేశ్వరం కమిషన్ విచారించగా.. ఆ తర్వాత వంతు కేసీఆర్, హరీశ్‌రావుదేనని చర్చ జరుగుతోంది.

సుమారు 100 మందికి పైగా విచారణకు హాజరుకాగా, కీలకమైన విచారణ సందర్భంగా పలువురు అధికారులు నేరుగా కేసీఆర్, హరీశ్‌రావు పేర్లను చెప్పడంతో వారు విచారణకు రాక తప్పదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి రాని కేసీఆర్ కాళేశ్వరం కమిషన్‌కు వస్తేనైనా చూడాలని జనం అనుకుంటున్నారనే చర్చ సాగుతోంది.

పెద్ది విజయ భాస్కర్