ఎర్రకోటలో స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనని అధికారులపై చర్యలు
న్యూ ఢిల్లీ, జూలై 30: ఎర్రకోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానిత అధికారులందరూ తప్పకుండా హాజరయ్యేలా చూడాలని కేం ద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు లేఖ రాశారు. గౌర్హాజరయ్యే వారిపై చర్యలు తీసుకుంటామని లేఖ లో స్పష్టం చేశారు. గతేడాది వేడుకల్లో చాలామంది అధికారులు పాల్గొనలేదని గుర్తించామని.. ఈసారి అలా జరుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనడం వారి విధి. దీనిలో ఎవ్వరికీ మినహాయింపు లేదు అని గౌబా స్పష్టం చేశారు.