13-04-2025 01:49:37 AM
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): గ్రూప్-1 ఫలితాల విషయంలో త మపై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డిపై టీజీపీఎస్సీ పరువునష్టం దావా వేసింది. వారంరోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని ఆయన్ను కమిషన్ డిమాండ్ చేసింది. లేని యెడల పరువునష్టం, ఇతర క్రిమినల్ కేసు లు నమోదుచేస్తామని హెచ్చరించింది.
తదుపరి టీజీపీఎస్సీపై రాకేశ్‌రెడ్డి ఎటువంటి ఆరో పణలు చేయకూడదని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని సూచించింది. టీజీపీఎస్సీపై తప్పుదోవపట్టించే, ధ్రువీకరించని అం శాలను మీడియా సమావేశంలో ప్రస్తావించారంటూ తమ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీ సే విధంగా ఉన్నాయని టీజీపీఎస్సీ అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి(లీగల్) ఆర్. సుమతి పేరున నోటీసులు జారీ అయ్యా యి.
నిరుద్యోగుల్లో అపనమ్మకం కల్గించే విధంగా మాట్లాడినట్లు తెలిపారు. కేవలం 10 నుంచి 15 కేంద్రాల్లో మాత్రమే అభ్యర్థులు అగ్రస్థానంలో నిలిచారంటూ చేసిన వ్యాఖ్యలు మొత్తం మూల్యాంకన ప్రక్రియపై అనుమానం కలిగించే విధంగా ఉన్నాయన్నారు.
దాశరథి గడ్డపై పుట్టినోన్ని..నోటీసులకు భయపడ: ఏనుగుల రాకేశ్‌రెడ్డి
అన్యాయాన్ని ఎదిరించడమే నేరమైతే ఆ నేరం మళ్లీ మళ్లీ చేస్తానని, దాశరథి పుట్టిన గడ్డపై పుట్టినవాడినని..ఇలాంటి నోటీసులకు భయపడేది లేదని బీఆర్‌ఎస్ నేత రాకేశ్‌రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులపై ఆయన స్పందిస్తూ..గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వాన్ని సహేతుకంగా ప్రశ్నిం చినందుకు తనపై పరువు నష్టం దావా వేశారన్నారు.
ప్రశ్నిస్తేనే పరువు పోతే మరి, మీ వల్ల జరిగిన అవకతవకల వల్ల జీవితాలను కోల్పోతున్న నిరుద్యోగులు ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉ న్న రేవంత్‌రెడ్డి గతంలో ఇదే టీఎస్‌పీఎస్సీపై రోడ్డెక్కి మరీ ఎన్నో విమర్శలు చేశారన్నారు.రని, అప్పుడెందుకు నోటీసులు ఇవ్వలేదని నిలదీశారు. మీ ఇజ్జత్ దావాకు ఇగురంగానే త్వరలోనే సమాధానం ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.