ఆస్తులు అమ్ముకొని 30 ఏళ్లు సేవ చేసినప్పుడు లక్ష్మణుడు అని పొగిడారు
ఇప్పుడు అదే నోటితో రావణుడు అంటున్నారు
ఏళ్లు సేవ చేసిన 30 రూపాయలు తీసుకోలేదు
వెంకటేశ్వరుని ఆలయానికి వచ్చి ప్రమాణం చేస్తారా.. విఠలేశ్వరాలయానికి వచ్చి ప్రమాణం చేస్తారా
కామారెడ్డి (విజయక్రాంతి): తన ఆస్తులు అమ్ముకొని పోచారం శ్రీనివాస్‌రెడ్డికి 30 ఏళ్ల పాటు సేవ చేసినప్పుడు తనను లక్ష్మణుడితో పోల్చారని ఇప్పుడు రావణుడు అంటున్నారని మాజీ జడ్పీటీసీ ద్రోణపల్లి సతీష్ అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడలో స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసం చేసిన చరిత్ర ఎవరిదో ప్రజలందరికి తెలుసు అన్నారు. ఎమ్మెల్యే కొడుకుని అహంకారంతో భాస్కర్‌రెడ్డి మాట్లాడడం ఆయన అవివేకతానికి నిదర్శనమన్నారు. ఎవరిని ఎవరు మోసం చేశారో వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద లేక విఠలేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రమాణం చేద్దామన్నారు. ఆలయాల్లో ప్రయాణం చేసేందుకు ఎప్పుడు వస్తావో భాస్కర్‌రెడ్డి సమయం చెప్పు అని అన్నారు.
తప్పుడు ఆరోపణలు చేయడం భాస్కర్‌రెడ్డికి నైజం అని అన్నారు. తనకున్న ఆస్తులు పెరిగాయి మీ ఆస్తులు పెరిగాయో తేల్చుకుందామన్నారు. మూడు దశబ్దాలుగా పోచారం శ్రీనివాస్‌రెడ్డితో ఉండి 30 రూపాయలు తీసుకున్నట్లు రుజువు చేస్తే తన తల నరుకుంటానని సవాల్ చేశారు. తన తండ్రి పేరు చెప్పి కోట్ల రూపాయలు సంపాదించినట్లు పోచారం భాస్కర్‌రెడ్డి తనపై ఆరోపణలు చేయడం బాధకరమన్నారు. తనకున్న భూములను అమ్మి నిర్మల్ జిల్లా బెంస్తా వద్ద 32 ఎకరాల భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. తాను 72 ఎకరాలు కొనుగోలు చేసినట్లు భాస్కర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ నమ్మి పదవులు ఇస్తే ఆయనకు మోసం చేసిన చరిత్ర మీది మీ కుటుంబానిదని అన్నారు. 1994లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి ఆస్తులేని ఇప్పుడు ఎంతకు ఎదిగారో లెక్కతో సహా చెప్పుతానని అన్నారు.
పోచారంను నమ్ముకొని అప్పులు చేసి గ్రామాలను అభివృద్ది చేసిన సర్పంచ్‌లు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేసిఆర్ వ్యవసాయశాఖ మంత్రిగా స్పీకర్‌గా అవకాశం కల్పిస్తే కష్టకాలంలో ఆయనను వదిలి వెళ్లిపోయారని విమర్శించారు. నమ్మిన వ్యక్తికి ద్రోహంచేసిన ఘనత మీదేనని భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి సతీష్ ఆరోపించారు. ఇసుక,మొరం మాఫియాను నడిపించింది ఎవరో సమాధానం చెప్పాలన్నారు. నోరు ఉందని తన తండ్రి ఎమ్మెల్యే అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తన తండ్రి పేరు చెప్పి కోట్లు సంపాదించాలని భాస్కర్‌రెడ్డి ఆరోపించడం తనపై విమర్శలు చేయడం బాధకరమన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రాంబాబు, మాజీ సర్పంచ్ మారుతి, మాజీ జడ్పీటీసీ స్వరూప, శ్రీనివాస్, గంగపుత్ర సంఘం సీనియర్ నాయకులు నర్రా సాయిలు, పుల్లెం బాబు, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు పాల్గొన్నారు.