calender_icon.png 16 November, 2024 | 6:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీరు యూరప్ వెళ్లిపోండి

16-11-2024 01:22:22 AM

కెనడియన్లకు ఖలిస్థానీ  మద్దతుదారుల డిమాండ్

అట్టావా (కెనడా), నవంబర్ 15: కెనడాలో ఖలిస్థాన్ సానుభూతిపరు లు మరో వివాదానికి తెరతీశారు. ఇప్పటివరకు హిందువులను లక్ష్యం గా చేసుకొని దాడులు చేసిన వారు తాజాగా స్థానికులైన కెనడావాసుల నే హెచ్చరించడం ప్రారంభించారు. ‘మీరంతా దురాక్రమణదారులు. తిరి గి ఇంగ్లడ్, యూరప్‌కు వెళ్లిపోండి’ అని హెచ్చరించారు. ఇటీవల కెనడాలో జరిగిన నగర సంకీర్తనలో పాల్గొన్న కొందరు ఖలిస్థానీ సానుభూతిపరులు ఇలాంటి హెచ్చరిక చేస్తూ వీడియోను విడుదల చేశారు.

‘ఇది కెనడా.. మా సొంత దేశం.. మీరు మీ సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోండి’ అని అందులో ఉంది. దీనిపై భారత నిఘా వర్గాలు స్పందిస్తూ కెనడాలో నిఘా లేకపోవడంతో ఖలిస్థా నీ సానుభూతిపరులు రెచ్చిపోతున్నారని.. అన్ని వ్యవస్థలను అదుపు చేసే స్థాయికి వారు ఎదుగుతున్నారని తెలిపాయి. ఖలిస్థానీలే లక్ష్యంగా చేసుకొని ఇండియా ఏజెంట్లు పనిచేస్తున్నారంటూ సాక్షాత్తూ కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించిన దగ్గర నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.