calender_icon.png 25 February, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ ఇండ్లకు మీరు అర్హులు కాదు!

25-02-2025 01:33:34 AM

పాలమూరులో 241 ఇండ్లపై రెవెన్యూ శాఖ అభ్యంతరం 

-ఇప్పటికే నోటీసులు జారీ ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న తహసీల్దార్ 

 -స్థానికతతో పాటు ఆస్తులు పరిగణనలోకి తీసుకున్న అధికారులు 

ఇండ్ల లబ్ధిదారులపై 12 మార్లు విచారణ చేసిన అధికార యంత్రాంగం 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): పాలమూరులో డబుల్ ఇండ్ల ట్రబుల్ చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటినుంచి పట్టణంలో నిర్మించిన డబుల్ ఇండ్ల లబ్ధిదారుల వివరాలు సేకరణతో పాటు జడ్చర్ల దేవరకద్ర నియోజకవర్గంలో కూడా లబ్ధిదారుల వివరాలను అధికారులు సేకరించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర పరిధిలో నిర్మించిన ఇండ్ల లబ్ధిదారుల విషయంలో అధికారులకు ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో దాదాపు 12 మార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా ఇటీవల వరుసగా లబ్ధిదారులు మీరు కారంటూ మీకు ఆస్తులతో పాటు ఇతరత్రా ఆదాయ వనరులు ఉన్నాయంటూ అర్బన్ తాసిల్దార్ కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారులకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా లబ్ధిదారులు ఉలిక్కిపడ్డారు. 

నిర్మాణాలు ఇలా...

మహబూబ్ నగర్ పట్టణంను గత ప్రభుత్వము ప్రత్యేకంగా గుర్తించి మిగతా నియోజకవర్గాల కంటే అధికంగా ఇక్కడ ఇండ్ల నిర్మాణం చేపట్టింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. స్లమ్ ఏరియల్ గా గుర్తింపబడిన పాత తోట, పాత పాలమూరు, ఎర్రమనుగుట్ట ప్రాంతాలను   2015 సంవత్సరంలో జనవరి 18 తేదీన అప్పటి సీఎం కేసీఆర్  ప్రత్యేకంగా సందర్శించారు. ఈ క్రమంలో 2300 ఇండ్లు ప్రత్యేకంగా మంజూరు చేయడం జరిగింది. దీంతోపాటు నియోజకవర్గం కి సంబంధించి అత్యధిక ఇండ్లను ఇక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది.

వీరన్నపేటలో 660, క్రిస్టియన్ పల్లి లో 330, దివిటిపల్లిలో 1024 పిల్లను లబ్ధిదారులకు అందజేశారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు.  మౌలాలిగుట్టలో 545 ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు పట్టాలు అందించిన గృహ ప్రవేశాలు మాత్రం జరగలేదు. ముందుగా మూలాలు గుట్ట లో నిర్మించి జారీ చేసిన ఇండ్ల పట్లదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.  దీంతోపాటు జర్నలిస్టులకు ఎస్వీఎస్ దగ్గర సర్వే నెంబర్ 25 లో దాదాపు 80 మందికి పైగా జర్నలిస్టులకు ప్లాట్లను ఇవ్వడం జరిగింది వీరు అక్కడ కొంతవరకు కాంట్రాక్టర్ నిర్మించిన పూర్తిస్థాయిలో లబ్ధిదారులు నిర్మించుకోవడం జరుగుతుంది. 

నోటీసులు తీసుకున్నవారు... రిప్లు ఇవ్వాల్సిందే...

మౌలాలిగుట్ట దగ్గర ఉన్న నిర్మించిన ఇండ్లకు పట్టాలు అందజేసిన వారికి అర్బన్ తాసిల్దార్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 98 మంది లబ్ధిదారుల వివరాలు అందుబాటులో లేవని వారు అందుబాటులో ఉంటే వివరాలు సమర్పించాలని, మరో 243 మంది అరువులు కాదని, ఇండివిజువల్గా వారికి సంబంధించిన ఆస్తులతో పాటు ఇతరత్రా వివరాలను పొందుపరుస్తూ నోటీసులు జారీ చేయడం జరిగింది. గత ప్రభుత్వము పట్టాలు అందజేస్తే, ఇంట్లోకి వెళ్ళకముందే నోటీసులు ఇస్తే ఎలా అని కొంతమంది లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏడు రోజుల్లో వివరణ ఇ వ్వాలని తాసిల్దారు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. రిప్లు కచ్చితంగా ఇవ్వాల్సిందని తాసి ల్దార్ ఘాన్సీ రామ్ నాయక్ తెలియజేశారు. 

పట్టణమంతా డబుల్ ఇండ్ల చర్చ..

ఒక్కసారిగా నోటీసులు జారీ కావడంతో పట్టణమంతా ప్రస్తుతం డబల్ ఇండ్ల చర్చ కొనసాగుతుంది. అసలు ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన పట్టాలు ఆమోదిస్తుందా లేదా అనే సందేహంతో చాలామంది లబ్ధిదారులు తాసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు. నిజమైన పేదలకు అన్యాయం చేయకూడదని, అధికారులు మరో మారు ఆలోచన చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఇక్కడ చూసిన డబల్ ఇండ్ల పంచాయతీలా ప్రత్యేక చర్చకు దారి తీస్తుంది. అసలు ఏమి జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితి నెలకొంది. డబుల్ ఇండ్ల లబ్ధిదారుల విషయంలో దాదాపు 12 మార్లు అధికారులు విచారణ చేయడం జరిగింది. లబ్ధిదారులు పేర్కొంటున్నారు. అధికారులు మానవతాదృక్పథంతో చూడాలని అందరికీ న్యాయం చేయాలని లబ్ధిదా రులు విన్నవిస్తున్నారు.