calender_icon.png 23 October, 2024 | 5:09 AM

అమ్మను చంపుకొని తినలేం

23-10-2024 02:54:02 AM

  1. అందరూ ఆవును గౌరవిస్తారు
  2. జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి

జమ్ముకశ్మీర్, అక్టోబర్ 22 : గోధ్వజ్ స్థాపన యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి మంగళవారం జమ్ములో గోప్రతిష్ఠ ధ్వజ్ స్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొన్నారు.

భక్తులను ఉద్దేశించి మాట్లాడు తూ.. గోమాత ప్రాశస్త్యాన్ని వివరించారు. అంతకుముందు శివ పూజ చేశారు. కాగా, జమ్ములో శంకరా చార్య స్వామీజీకి ఘన స్వాగతం లభించింది. భక్తులు పూలమాలలతో ఆయనకు స్వాగతం పలికారు. జమ్ముకశ్మీర్‌లో పర్యటన ఎంతో విశేషమని స్వామీజీ పేర్కొ న్నారు.

ఈ ప్రాంతంలో సింధు నది పుట్టుక, ప్రవాహం తనను ఎంతో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. కానీ భారత్‌లో గోమాతపై కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కూడా మాట్లాడటం లేదని చెప్పారు. ఇది ఎప్పటికైనా జరగాల్సిందే.. కానీ మన ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం లేదని శంకరాచార్య అన్నారు.

ఢిల్లీకి వెళ్లాక ప్రధాని మోదీతో ఈ విషయంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రధాని మోదీ తన మాటను గౌరవిస్తారని, అమ్మను చంపుకుని తినాలని ఎవరు భావించరని పేర్కొన్నారు. గోయాత్ర ముగిసిన తర్వాత ప్రధాని మోదీని కలిసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.