calender_icon.png 17 October, 2024 | 3:46 PM

ఈ సొరంగాల్లో బైక్ నడుపొచ్చు

17-10-2024 01:31:07 AM

బీరుట్, అక్టోబర్ 16: ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకొని ప్రాణాలు కాపాడుకొనేందుకు హమాస్ కనిపెట్టిన అద్భుత మార్గం సొరంగాలు. గాజాలో పైన చూస్తే సాధారణంగా కనిపించే భూమి లోపల మాత్రం సాలె గూడు లాంటి అంతుచిక్కని సొరంగాలు ఉంటాయి. ఇటీవల ఆ సొరంగాలన్నింటినీ ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. తాజాగా లెబనాన్‌లో హెజ్బొలా సంస్థ కూడా హమాస్‌కు మించి సొరంగాలు తవ్విందని ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది. ఈ సొరంగాలకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. ఈ సొరంగాలు ఎంత పెద్దగా ఉన్నాయంటే.. బైక్‌పై వాటిలోంచి రయ్‌మని దూసుకుపోవచ్చు.