calender_icon.png 20 April, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనులు ఇచ్చి బిల్లులు ఇవ్వలే

17-12-2024 02:06:46 AM

నా నియోజకవర్గంలో రూ.౭ కోట్లు పెండింగ్

బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి  

హైదరాబాద్, డిసెంబర్ ౧౬ (విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పనులను మంజూరు చేసి బిల్లులు ఇవ్వలేదని బీజేపీ కా మారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం కామారెడ్డిలోనే దాదాపు రూ.7 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని స్పష్టంచేశారు. మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గంలో కూడా అదేస్థాయిలో బిల్లులు రావాల్సి ఉందని అన్నారు. మనఊరు బడి, వైకుంఠదామాలు, సీసీ రోడ్లకు సంబంధించిన నిధులు విడుదల కావాల్సి ఉందని చెప్పారు. ఏ ప్రభుత్వం అయినా మాజీ సర్పంచ్‌లకు చెల్లించాల్సిన బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.